టెక్నాలజీ

ఆండ్రాయిడ్ వినియోగదారులకు యూట్యూబ్ Dark Mode వచ్చేసింది..!

దాదాపు సంవత్సరం క్రితం యూట్యూబ్ డెస్క్‌టాప్ వినియోగదారులకు, ఆరు నెలల క్రితం iOS వినియోగదారులకు “డార్క్ మోడ్” (చీకటి స్థితి) సదుపాయం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సదుపాయం ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

డార్క్ మోడ్ వల్ల కంటిమీద భారం తగ్గుతుంది, రాత్రి వేళల్లో వాడటానికి తెర మొత్తం నలుపు/గ్రే రంగులో వుండడం వల్ల సౌకర్యవంతంగా వుంటుంది. బ్యాటరీ కూడా తక్కువ ఖర్చవుతుంది. గతకొద్ది కాలంగా డెస్క్‌టాప్, ఐఫోన్, యూట్యూబ్ మ్యూజిక్ అనువర్తనాల్లో పరీక్షించిన తరువాత ఇప్పుడు అందరు ఆండ్రాయిడ్ వినియోగదార్లకూ దశలవారీగా అందుబాటులోకి తెస్తుంది.

ఈ సదుపాయాన్ని వాడటానికి ముందు యూట్యూబ్ అప్లికేషన్‌ను అప్డేట్ చేసుకోవాలి. తర్వాత యూట్యూబ్ అప్లికేషన్ ను తెరచి సెట్టింగ్స్ > Digital Wellbeing > Dark Mode ను ఎంచుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ సదుపాయం కనిపించకపోతే వారం రోజులలోపు వస్తుందని గమనించండి.

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment