టెక్నాలజీ తెలుగు

వాట్సాప్‌లో డార్క్ మోడ్ వచ్చేస్తోంది

వరుసగా, సైలెంట్‌గా అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న వాట్సాప్ తాజాగా డార్క్ మోడ్ ను కూడా తీసుకురానుంది. రాత్రి సమయంలో కంటికి ఇబ్బంది కలుగకుండా, బ్యాటరీని ఆదా చేసేదిగా డార్క్ మోడ్ పట్ల చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల అన్ని మేజర్ సోషల్ మీడియా అప్లికేషన్లూ ఈ డార్క్ మోడ్‌ను విడుదల చేస్తూన్న నేపథ్యంలో వాట్సాప్ కూడా ఈ ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టి వుంది.

ఇటీవలె విడుదలైన బీటా వర్షన్లో దీనికి సంబంధించిన కోడ్ బయటపడింది. అధికారికంగా ఈ డార్క్ మోడ్ ఎలా వుండబోతోందన్న అంశంపై స్పష్టత లేకపోయినా, వాట్సాప్ బీటా వర్షన్లను పరిశీలిస్తున్న కొందరు ఔత్సాహికులు ఇప్పటికే వున్న iOS వర్షన్ నలుపు రంగులో వుంటే ఎలా వుంటోందో ఒక ఇమేజ్‌ను ఎడిట్ చేసారు. సో, త్వరలోనే యూట్యూబ్, ట్విట్టర్‌లోలా వాట్సాప్‌ను కూడా డార్క్ మోడ్‌లో వాడబోతున్నామన్నమాట!

గమనిక: ఇది అధికారిక WhatsApp డార్క్‌మోడ్ కాదు, ఔత్సాహికులు ఎడిత్ చేసింది మాత్రమే.

Leave a Comment