టెక్నాలజీ తెలుగు

వాట్సాప్‌లో ఇక చెత్త లింకులు తగ్గబోతున్నాయి!

వాట్సాప్ మెసెంజర్ అత్యంత అవసరమైన ఫీచర్‌ ని తీసుకువచ్చింది. “ఈ మెసేజ్‌ను పది గ్రూపులకు ఫార్వార్డ్ చేయండి పేటీఎంలో 500 కాష్ పొందండి” అంటూ ఒక స్పాం (అవసరం లేని చెత్త) మెసేజ్‌తో పాటు ఒక లింకు షేర్ అవుతుంది. ఆ లింకు కూడా చూడటానికి అచ్చం paytm.com లాగానే కనిపిస్తుంది. లింకు తెరచినతరువాత కూడా అచ్చుగుద్దినట్లు Paytm లాగానే కనిపిస్తూ ఐడీ, పాస్వార్డ్లు  (Password)ఎంటర్ చేయమనో, లేదా ఇతరులకు ఫార్వార్డ్ చేస్తేనో 500 కాష్ వస్తుందంటూ కనిపిస్తుంది. ఇలాంటి నకిలీ మెసేజ్‌లను నమ్మి చాలామంది మోసపోతున్నారు. నిజానికి ఆ లింకులో Paytm అనే అక్షరాలను పోలిన వేరే అక్షరాలుంటాయి.

ఇకమీదట WhatsApp ఇలాంటి సందేశాలను జల్లెడ పట్టబోతుంది. కోట్లాది వాట్సాప్ వినియోగదారుల సందేశాల్ని బట్టి స్పాం సందేశాలను/లింకులను గుర్తించి వాటి గురించి వినియోగదారుల్ని ముందు హెచ్చరించబోతోంది. తద్వారా వాట్సాప్‌లో స్పాం సందేశాలకు చెక్ పెట్టబోతోంది.

ఈ సదుపాయం వాట్సాప్ 2.18.221 బీటా వర్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. అందరు వినియోగదారులకూ మరో వారంరోజుల్లో అందుబాటులోకి రానుంది.

ఇప్పుడే వాట్సాప్ తాజా వర్షన్‌ను డౌన్లోడ్ చేసుకోండి: Play Store || App Store

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment