వార్తలు సోషల్ మీడియా

ఏమిటీ “కికి ఛాలెంజ్”? పోలీసులు ఎందుకు హెచ్చరిస్తున్నారు?

ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్..తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించిన గ్రీన్ ఛాలెంజ్‌ను విన్నాం. ఇప్పుడు మరొక ఛాలెంజ్ పేరు వినబడుతుంది. అదే “కికి ఛాలెంజ్”. ఈ ఛాలెంజ్‌నే #InMyFeelingsChallenge గా కూడా పిలుస్తున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వినబడుతున్నాయి. అవేంటో, ఎందుకో చూద్దాం.

ఏమిటీ కికి ఛాలెంజ్?

ఈ ఛాలెంజ్ ప్రకారం కదులుతున్న కార్‌లో నుండి బయటకు దిగి “ఇన్ మై ఫీలింగ్స్” అనే పాటకు లయబద్ధంగా డ్యాన్స్ వేయాలి. ఈ పాటను డ్రేక్ అనే వ్యక్తి స్కార్పియన్ ఆల్బంలో రూపొందించారు. ఈ పాటలోనే “కి కి” అనే చరణం కూడా వస్తుంది కనుక ఈ ఛాలెంజ్‌కు “కి కి ఛాలెంజ్”గా పేరు పెట్టారు. సోషల్ మీడియా పుణ్యమా అని అవసరంలేని ఛాలెంజ్‌లు కూడా ఆదరణ పొందుతున్నాయి. దానికి ఈ కికి ఛాలెంజ్ ఏ ఉదాహరణ.

కదులుతున్న కార్ నుండి దూకి కార్‌తో పాటు కదులుతూ పాటకు తగ్గట్టు డ్యాన్స్ వేయాలి. దీని వల్ల రోడ్డుపై వస్తున్న గుంతలు, ఇతర వాహనాలను గమనించే అవకాశం తక్కువగా వుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాక కార్ డ్రైవ్ చేసే వ్యక్తే వీడియో కూడా తీస్తుండడంతో ప్రమాదాలు రెండువైపుల నుండీ జరుగుతున్నాయి. గత రెండు రోజులలోనే అనేకమంది ఈ ఛాలెంజ్ వల్ల గాయలపాలయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. మనదేశంలో కూడా అన్ని రాష్ట్రాలనుండీ ఈ ఛాలెంజ్ వల్ల ప్రమాదాలు జరుగుతుండడం, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు పెరుగుతుండడంతో వివిధ రాష్ట్రాల పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా తెలంగాణ పోలీసులు కూడా కికి ఛాలెంజ్‌లో పాల్గొనడంపై నిషేధం జారీ చేశారు. ఒకవేళ ఎవరైన పాల్గొంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ముఖ్యంగా ప్రముఖ వ్యక్తులు (సెలబ్రిటీలు) ఈ ఛాలెంజ్‌ను ప్రోత్సహించడం సరికాదని పోలీసులు అభిప్రాయపడ్డారు. సినీనటి రెజీనా ఈ ఛాలెంజ్‌లో పాల్గొని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడం పట్ల కూడా పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెజీనా తన ట్విట్టరు ఖాతాలో పోస్టు చేసిన “కికి ఛాలెంజ్” ట్వీటు:

“కికి ఛాలెంజ్”పై వివిధ రాష్ట్రాల పోలీసులు, ఇతరుల ట్వీట్లు:

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment