టెక్నాలజీ

3MB లోపే..ట్విట్టర్ లైట్ అప్లికేషన్ ఒచ్చేసింది..!

ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా అప్లికేషన్లు వివిధ సదుపాయాలను పెంచుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఆ అప్లికేషన్ల సైజు భారీగా పెరుగుతూ వచ్చింది. ట్విట్టర్ యాండ్రాయిడ్ అప్లికేషన్ 31.1 MB ఉండగా ఫేస్బుక్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ సైజు ఏకంగా 73.3 MB ఉంది. స్మార్ట్ ఫోన్లలో స్టోరేజ్ ఎక్కువ ఉంటున్నా అనేక అప్లికేషన్లు, మీడియా ఫైళ్లు పెరుగుతూండటంతో స్టోరేజ్ సమస్య వస్తుంది. ఇది స్పెసిఫికేషన్లు తక్కువ వున్నా ఫోన్లయితే బ్రౌజర్లో మొబైల్ వర్షన్ దిక్కు. ఈ సమస్య గురించే ముఖ్యమైన సర్వీసులన్నీ తమ ‘భారీ’ అప్లికేషన్లకు ‘లైట్’ వర్షన్లను కూడా విడుదల చేస్తున్నాయి. గత ఏడాది ఫేస్బుక్ మెసెంజర్, ఫేస్బుక్ అప్లికేషన్లకు లైట్ వర్షన్ విడుదలయిన తరువాత తాజాగా ట్విట్టర్ కూడా ఈ ‘లైట్’ ను ఫాలోఅయింది.

ఈ రోజు మొదలుకుని ప్రపంచవ్యాప్తంగా 21 దేశాలలో (భారతదేశం, ఆర్జెంటినా, బెలారస్, డొమినికన్ రిపబ్లిక్, ఘానా, గ్వాటెమాల, హోండురస్, ఇండోనేసియా, జోర్డాన్, కెన్యా, లెబనాన్, మొరాక్కో, నికరాగువా, పరగువాయ్, రోమానియా, టర్కీ, యుగాండా, యుక్రెయిన్, వురుగాయ్, యెమెన్, జింబాంబ్వే)  ట్విట్టర్ అప్లికేషన్ కు ‘లైట్’ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ లైట్ అప్లికేషన్ కేవలం 3 MB లోపే ఉండడం గమనార్హం. లో ఎండ్ డివైస్ లలో, ఎక్కువగా ఫీచర్స్ అవసరం లేదు అనుకునేవారికి ఈ లైట్ వర్షన్ బాగాపనికొస్తుంది. అంతేకాదు, ఈ లైట్ వర్షన్ డేటా సేవర్ మోడ్ కూడా ఉంటుంది. దీనివల్ల ట్విట్టర్ లోని ఫోటోలు, వీడియోలు వాటంతట అవే డౌన్లోడ్ అవ్వకుండా మాన్యువల్ గా సెలెక్ట్ చేస్కుని డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది.

గమనిక: WhatsApp, Telegramలలో మా అప్డేట్స్‌ను పొందేందుకు http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog ఛానళ్ళలో చేరండి.

avatar
  Subscribe  
Notify of