తెలుగు స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశం

తెలుగులో ‘స్టాక్ మార్కెట్’ – సిరీస్ ప్రారంభం

స్టాక్ మార్కెట్ / షేర్ మార్కెట్ – తరచూ వినే పేరు. పత్రికలలో బిజినెస్ పేజి చదివేవారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎస్.బి.ఐ షేర్ ధరలు పెరిగాయి, తగ్గాయని, భారీగా లాభాలు వచ్చాయని, నష్టపోయాయని, ఆన్యువాల్ స్టేట్మెంట్లు విడుదల చేసారని, బోర్డు మీటింగ్ జరిగిందనీ, ఇలా రకరకాల పదాలను చాలామంది తరచూ చదువుతుంటారు కానీ అంతగా ఆసక్తి చూపరు. మరికొంతమందికి ఆసక్తి ఉన్నా సరైన సమాచారం దొరక్క పట్టించుకోరు. కొంతమందికి ఇంగ్లీష్ ప్రాబ్లం. ఇంకొంతమంది స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనే స్టేజ్ లో  ఉండొచ్చు.

స్టాక్ మార్కెట్ గురించి ఇంగ్లీష్ లో కావలసినంత సమాచారం అందుబాటులో ఉంది. మళ్ళీ దానిని కొత్తగా ఇంగ్లీష్ లోకి మార్చిరాయడమో, సులభంగా తయారుచేయవలసిన అవసరమో కూడా ఉన్నట్లు అనిపించలేదు.  తెలుగులో మాత్రం కొన్ని వీడియోలు అందుబాటులో ఉన్నా, అందులో చాలా వీడియోలు ఆంగ్లం నుండి తర్జుమా చేసినట్టు ఉన్నాయే తప్ప, ఎక్కడా వివరంగా ఉన్నట్లు కన్పించలేదు.  ఏవైనా పుస్తకాలు అందుబాటులో ఉన్నదీ నాకు తెలియదు. ఇప్పటిదాకా నేను నేర్చుకున్న కొంత, నేర్చుకోబోతున్న మొత్తం ఇదే బ్లాగులో ‘సిరీస్’గా తెలుగులోనే సాధ్యమైనంత వివరంగా రాయాలని నిర్ణయించుకున్నాను.

స్టాక్ మార్కెట్ గురించి ఇంగ్లీష్ లో చాలా మందే రాసినా, నాకు Zerodhaలో పనిచేసే ‘కార్తిక్ రంగప్ప’ గారు రాసిన ‘Varsity’ తేలికగా, వివరంగా ఉన్నట్లు అనిపించింది. ఆ Varsity నే తెలుగులోకి మార్చి ఇక్కడ రాయడం జరుగుతుంది.  స్టాక్ మార్కెట్స్ పై ఆసక్తి ఉన్నవారు, కొత్తగా తెలుసుకోవాలనుకునేవారు ఇదే బ్లాగును ఫాలో అవ్వవచ్చు. ఇంగ్లీష్ లో చదవగలం అనుకునేవారు ఈ లింక్ లో చదువుకోవచ్చు.

Varsity లో ఉన్న భాగాలు:

(ఇందులో చాలా పదాలు ఇంగ్లీష్ లోనే ఉంచడం జరిగింది. ఉదాహరణకు ‘ట్రేడింగ్’ అంటే తెలుగులో ‘వర్తకం’ అని అర్ధం. భవిష్యత్తులో స్టాక్ మార్కెట్ వినియోగంలో వర్తకం అనడం కుదరదు కనుక ‘ట్రేడింగ్’ గానీ రాయడం జరుగుతుంది. ట్రేడింగ్ అంటే ‘వర్తకం’ అనే వివరణ మాత్రం సందర్భం వచ్చినప్పుడు వివరిస్తాను. ‘ఫ్యూచర్స్ & ఆప్షన్స్’ లాంటి పదాలను తెలుగులోకి మార్చడం కుదరదు కాబట్టి వీలుని బట్టి కొన్ని పదాలను తెలుగులోకి మార్చగా, కొన్ని పదాలను యధావిధిగా ఇంగ్లీష్ లోనే ఉంచడం జరిగింది.)

 1. స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశం
 2. సాంకేతిక విశ్లేషణ
 3. ప్రాథమిక విశ్లేషణ
 4. ఫ్యూచర్స్ ట్రేడింగ్
 5. ప్రొఫెషనల్ ట్రేడింగ్ కోసం ఆప్షన్స్ థియరీ
 6. ఆప్షన్స్ వ్యూహాలు
 7. మార్కెట్స్ & టాక్సేషన్
 8. కరెన్సీ & కమోడిటీ ఫ్యూచర్స్
 9. రిస్క్ మానేజ్మెంట్ & ట్రేడింగ్ సైకాలజీ

మొత్తం 9 చాప్టర్లలో, చాలా సబ్-టాపిక్స్ ఉన్నాయి. ముందుగా మొదటి భాగంతో మొదలు.

1. స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశం:

ఈ చాప్టర్లో స్టాక్ మార్కెట్ గురించి కనీస అవగాహన కలుగుతుంది. స్టాక్ మార్కెట్ కన్నా ముందుగా, ఎందుకు పెట్టుబడి పెట్టాలి అనే విషయాలున్నాయి. కింద చూపబడిన ఆర్డర్లో చదవబోతున్నాం.

(పైన చెప్పినట్లే ఇక్కడ కూడా అవసరాన్ని బట్టి కొన్ని పదాలను ఇంగ్లీష్ లోనే ఉంచడం జరిగింది. వాటి గురించి తరువాత వివరంగా తెలుసుకుందాం.)

 • ఎందుకు పెట్టుబడి పెట్టాలి?
 • మార్కెట్ ఎవరి ఆధీనంలో ఉంటుంది?
 • ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్
 • IPO మార్కెట్ – 1
 • IPO మార్కెట్ – 2
 • స్టాక్ మార్కెట్
 • స్టాక్ మార్కెట్ ఇండెక్స్
 • సాధారణంగా వాడబడే ‘అర్ధం కాని పదాలు’
 • ట్రేడింగ్ టర్మినల్
 • క్లియరింగ్ & సెటిల్మెంట్ ప్రాసెస్
 • ఈ 5 కార్పోరేట్ ఆక్షన్స్ వల్ల స్టాక్ మార్కెట్ పై ప్రభావం
 • ముఖ్యమైన ఈవెంట్లు, స్టాక్ మార్కెట్ పై వాటి ప్రభావం
 • మొదలు
 • సప్లిమెంటరీ నోట్

రేపు (27/10/2017) న మొదటి టాపిక్ ‘ఎందుకు పెట్టుబడి పెట్టాలి’తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. సందేహాలు, సలహాలు క్రింద కామెంట్ బాక్స్ ద్వారా తెలుపగలరు.

గమనిక: ‘ఎవరైనా ఎందుకు పెట్టుబడి పెట్టాలి’ – మొదటి చాప్టరు రాయబడింది.

ఫేస్బుక్ ద్వారా ‘స్టాక్ మార్కెట్’ సిరీస్ అప్డేట్స్ పొందటం కోసం లైక్ చేయండి:

 

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment