సినిమా

ఎస్ పి శైలజ – గాయకురాలు మాత్రమే కాదు..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ గాయకులల్లో ఒకరైన శ్రీపతి పండితారాధ్యుల శైలజ (ఎస్ పి శైలజ ) గారు నేపథ్య గాయకురాలుగా మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ సంగీతమే కాకుండా నాట్యం, నటన, డబ్బింగ్ రంగాలలో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నెల్లూరు జిల్లా కొనేటమ్మపేట గ్రామంలో 1962 అక్టోబర్ 9 న పుట్టి చెన్నైలో పెరిగారు.

Sangeetham Paata Sailaja – 1 -S P Sailaja Life & Career

తండ్రి హరికథ కళాకారుడు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తీ గారు, తల్లి శ్రీపతి పండితారాధ్యుల శకుంతలమ్మ గారు , అన్న ప్రముఖ గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం (ఎస్ పి బాలసుబ్రమణ్యం). 1989 లో నటుడు శుభలేఖ సుధాకర్(సురవజుల సుధాకర్) గారితో వివాహం జరిగింది. సురవజుల శ్రీకర్ వారి ఏకైక కుమారుడు .

1977 లో గాయకురాలిగా అరంగేట్రం చేసిన శైలజ గారు పెళ్లి కాకముందే ప్రముఖ గాయకురాలు ఎస్ పి శైలజ గా పేరు పొందారు. తన ఇంటిపేరు విషయం లో తన భర్త కూడా అభ్యంతరం తెలుపకపోవడంతో ఎస్ పి శైలజగా కొనసాగారు. ఇంటి పేరు విషయం లో మరికొన్ని కారణాలు కూడా దోహదం చేసాయి.

1983 లో విడుదలైన కల తపస్వి కె విశ్వనాథ్ గారి సాగర సంగమం చిత్రంలో కమల హాసన్ కూతురిగా నటించారు. నటిగా శైలజ గారికి ఏకైక చిత్రం ఇదే. నటనలో ఆసక్తి లేకపోయినా దర్శకుడు కె విశ్వనాధ్ మరియు నిర్మాత ఏడిద నాగేశ్వర రావు ఆ పాత్ర కోసం భరతనాట్యం వచ్చిన శైలజ గారే కావాలని పట్టు పట్టడంతో అన్న బాల సుబ్రహ్మణ్యం సహకారం తో ఈ సినిమాలో నటించారు.

గాయకురాలుగా తీరిక లేకుండా ఉన్న సమయంలోనే డబ్బింగ్ ఆలోచన లేకపోయినా డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఎన్నో సినిమాల్లో చాలా మంది నటీమణులకు తన స్వరాన్ని అందించారు. దర్శకుడు విజయ్ బాపినీడు గారి పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా లో మొదటిసారిగా నటి రాధికా గారికి డబ్బింగ్ చెప్పారు. తర్వాత నటి శ్రీదేవి, టబు, సోనాలి బింద్రే మరికొంత మంది నటీమణులకి డబ్బింగ్ చెప్పారు.

శైలజ గారు డబ్బింగ్ చెప్పిన సినిమాలు:

* పట్నం వచ్చిన పతివ్రతలు (రాధికా) 1982

* వసంత కోకిల (శ్రీదేవి) 1983

* నాయకుడు(శరణ్య) 1987

* గుణ (రేఖ) 1991

* ఆదిత్య 369 (మోహిని) 1991

* శాస్త్రి (రాధికా) 1995

* నిన్నే పెళ్లాడతా (టబు) 1996

* భామనే సత్యభామనే (హీరా రాజగోపాల్) 1996

* మాస్టర్ (సాక్షి శివానంద్) 1997

* సింధూరం (సంఘవి) 1997

* చంద్రలేఖ (ఇషా కొప్పికర్) 1998

* ఆవిడా మా ఆవిడే (టబు) 1998

* తెనాలి (దేవయాని) 2000

* మురారి (సోనాలి బింద్రే) 2001

* అభయ్ (రవీనా తాండన్) 2001

* పంచతంత్రం (ఐశ్వర్య శివచంద్రన్) 2002

తెలుగు చిత్రపరిశ్రమ కి ఎంతో మంది గాయకులని అందించిన సూపర్ సింగర్ టీవి షో సీసన్స్ 1,2,3 మరియు సూపర్ సింగర్ జూనియర్స్ షో కి కూడా న్యాయనిర్ణేత గా వ్యవహరించారు.

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment