జ్ఞానం టెక్నాలజీ తెలుగు వార్తలు

దేశంలో ఎక్కడైనా సరే, ఇక ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్, RC లతో పనిలేదు!

ఏ రాష్ట్రప్రభుత్వమైనా సరే, పట్టణాలు-నగరాలు అనే తేడా లేదు, ఎక్కడైనా సరే ఇక ఫిజికల్ గా డ్రైవింగ్ లైసెన్సు, RC కార్డు, ఇన్సూరెన్సు తదితర పత్రాలను ఇక చేత పట్టుకెళ్ళక్కర్లేదు! ఇకమీదట కేంద్రప్రభుత్వం విడుదల చేసిన DigiLocker కానీ, mParivahan కానీ ఈ అప్లికేషన్లలో మీ డ్రైవింగ్ లైసెన్సు, RC తదితర పత్రాలను లోడ్ చేసుకుని చూపిస్తే చాలు, దేశవ్యాప్తంగా చెల్లుతాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

నిజానికి ఈ సదుపాయాన్ని కొన్ని నెలల క్రిందటే ప్రారంభించినా చాలామంది ట్రాఫిక్ పోలీసులు మాకు ఫిజికల్ కాపీ కావాల్సిందే, ఇది చెల్లదు అని ఫైన్లు వేసేవారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఏదీ లేకపోవడంతో అన్ని పత్రాలూ సరిగా వున్నా ఫిజికల్ కాపీ లేనందుకు చలానా కట్టాల్సి వచ్చేది. చాలాకాలంగా దీనికి సంబంధించి రోడ్డుభద్రత శాఖకు అనేక ఫిర్యాదులు, సమాచార హక్కు చట్టం ద్వారా అప్లికేషన్లు వస్తూండటంతో దీనికి సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రకారం దేశ వ్యాప్తంగా ఎక్కడైనా సరే DigiLocker, mParivahan అప్లికేషన్లలో మీ డ్రైవింగ్ లైసెన్సు, RC తదితర ప్రతులను చూపిస్తే చాలు. అవి చెల్లుబాటు అవుతాయని, ఇది అధికారికమేననీ తెలిపింది. ఒకవేళ ఎవరైనా అభ్యంతరం తెలిపితే ఈ ఆర్డర్ కాపీ చూపించవచ్చనీ తెలిపింది.

ఈ ఇబ్బంది తెలంగాణ రాష్ట్రంలో RTA-mWallet అప్లికేషన్ ఉండటంతో లేకపోయినా, వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మరియు ఇతర రాష్ట్రాల వాహనదారులకు తీవ్రంగా ఇబ్బందవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన ఈ ప్రకటన పెద్ద ఉపశమనమే!

ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డరు కాపీతో DigiLocker అధికారికంగా ఇలా ట్వీట్ చేసింది:

Leave a Comment