టెక్నాలజీ

రిలయన్స్ జియో గిగా ఫైబర్, గిగా TV, స్మార్ట్ హోమ్ ప్రోడక్ట్స్, VR గురించి పూర్తి వివరాలివే!

చాలాకాలంగాఎదురుచూస్తున్న రిలయన్స్ జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్లు ఈ ఆగస్టు 15 నుండే ప్రారంభమవుతున్నాయి. గతకొంతకాలంగా టెస్టింగ్ మోడ్ లో కొందరికి వేర్వేరు నగరాల్లో అందుబాటులో వున్నా పూర్తి స్థాయిలోరాలేదు. ఇటీవల కాలంలో ఈ గిగా ఫైబర్ నెట్ వస్తుందనే ఇప్పటికే ఇంటర్నెట్ రంగంలో దిగ్గజాలైన Act Fibernet, Hathway, Hireach లాంటి సంస్థలు భారీగా ధరలను తగ్గించడమే కాకుండా ఇంటర్నెట్ వేగాన్ని కూడాపెంచారు. అంతలా మార్చడానికి కారణం మాత్రం ఈ “జియో ఫైబర్ నెట్” యే. దీనిగురించి పూర్తివివరాలనిప్పుడు చూద్దాం.

రిలయన్స్ జియో 2016 సెప్టెంబర్లో టెలికం రంగంలోకి అడుగుపెట్టింది. అప్పుడే ఈ జియో ఫైబర్ నెట్ గురించి ప్రకటించినా ఇప్పటివరకు మరే ప్రస్తావనా తేలేదు. ఇటీవలే జరిగిన రిలయన్స్ వార్షికోత్సవ మీటింగులో సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ఈ ఆగస్టు 15 నుండి జియో ఫైబర్ నెట్ రిజిస్ట్రేషన్లు జియో ఫోన్ 2 రిజిస్ట్రేషన్లతో పాటూ మొదలవుతాయని తెలిపారు. వీటితో పాటే, జియో ఫైబర్ నెట్ ఆధారంగా పని చేసే Jio Giga TV, వర్చువల్ రియాలిటీ, హోమ్ సర్వీసెస్ కూడా అందుబాటులోకి అదే రోజున రానున్నాయి.

రిలయన్స్ జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్

జియో గిగాఫైబర్ కనెక్షన్ ను పొందేందుకు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్లు ఈ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున మొదలవనున్నాయి. మీ ఫోన్లోని MyJio యాప్ ద్వారా గానీ www.jio.com లో లాగిన్ అయ్యి గానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం.  ఇదే రోజున Jio Phone 2 ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.

ఏమిటీ జియో గిగాఫైబర్, గిగా TV, VR, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్?

  • 1 GBPS  బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ మరియు GigaTV:

గిగాఫైబర్ కు రిజిస్టర్ చేసుకున్నవారికి GigaTV సెట్ టాప్ బాక్స్ కూడా కలిపి వస్తుంది. ఈ GigaTV STB ద్వారా 400 కు పైగా చానళ్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాక ఇప్పటికే జియో సినిమా, జియో మ్యూజిక్ లలో ఉండే అన్ని పాటలూ, సినిమాలూ కూడా వస్తాయి. ఈ GigaTV గిగాఫైబర్ కనెక్షన్ పై ఆధారపడి పనిచేస్తుంది.

  • రిలయన్స్ జియో స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ (IoT):

జియో గిగాఫైబర్ ద్వారానే స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్  పేరిట IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సదుపాయాలను అందించనుంది. మీ ఇంటి లేదా ఆఫీసుకు రక్షణను పెంచుకునే సదుపాయాలు కూడా IoT లో ఉండబోతున్నాయి. ఆడియో dongle (దీని ద్వారా మీరు చెప్పే వాయిస్ commands ద్వారా పనులు చేస్తుంది), వైఫై extender (వైఫై కనెక్షన్ ను మరింత దూరం విస్తరించుకునే పరికరాలు), స్మార్ట్ ప్లగ్ (వాటంతట అవే ఆన్/ఆఫ్ అయ్యే లైట్లు లాంటివి), CCTV కెమెరాలు, ఇంటి లోపల పెట్టుకునే కెమెరాలు, No Smoking Zone లో పొగ త్రాగితే తెలిపే పరికరాలు, సైరన్లు, IR బ్లాస్టర్లు, ఇంట్లో గ్యాస్ లీక్ అయితే అలర్ట్ చేయడం లాంటి అనేక సదుపాయాలు జియో SHS (స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్) ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

  • వర్చువల్ రియాలిటీ 

GigaTV సెట్ టాప్ బాక్స్ ద్వారా వినియోగదారులు HD వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ వీడియో కాల్స్ ను GigaTV వినియోగదారులకు కాక మొబైల్ వినియోగదారులకి కూడా చేసుకోవచ్చు. సో, ఇక మీ TV తోనే ఫామిలీ మొత్తం కలిసి HD వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాక ఈ సెట్ టాప్ బాక్స్ ద్వారా augmented reality (నిజమైన ప్రపంచంలాగానే అనిపించే వర్చువల్ ప్రపంచం), 360 డిగ్రీల వీడియోలు, ఇతరత్రా VR కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కూడా జియో ఫైబెర్నెట్, GigaTV STB మీద ఆధారపడి పనిచేస్తుంది.

ఇవేకాదు, డిజిటల్ సర్వీసుల ద్వారా ఏమేం అందించొచ్చో అన్ని రకాల వాటిపై జియో పరిశోధన చేస్తుంది. ఖచ్చితంగా జియో ఫైబర్నేట్ భారతదేశంలోని ప్రతీ ఇంటిలో భారీ మార్పులు తెస్తుందనడంలో సందేహంలేదు. జియో ఫైబెర్నెట్ కనెక్షన్ వున్న ఇంట్లో 1 GBPS హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, అన్ని HD TV చానళ్లు, HD వీడియో కాల్స్, విద్యుత్ కు సంబంధించిన అన్ని పరికరాలను IoT సహాయంతో వాటంతట అవే ఆన్/ఆఫ్ లాంటి సదుపాయాలు దేశ ప్రజల రోజువారీ జీవనంపై గట్టి ప్రభావమే చూపబోతుంది.

ప్రారంభ దశలో జియో ఫైబర్నెట్ దేశవ్యాప్తంగా మొదట 1100 నగరాల్లో ఈ ఫైబర్ నెట్ మొదలవుతుంది. ఈ 1100 నగరాల ఎంపిక రిజిస్ట్రేషన్ల ఆధారంగా జరగనుంది. ఒకవేళ మీ పట్టణంలో ముందు మొదలవ్వాలంటే అక్కడ ఎక్కువమంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమే కాబట్టి మీకు తెలిసినవారితో కూడా రిజిస్ట్రేషన్లు చేయిస్తే మీ నగరానికి కూడా ముందే అందుబాటులోకి వస్తుంది.

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment