టెక్నాలజీ టెలికాం తెలుగు

జియో వినియోగదార్లు నెలకు వాడేది 10జీబీనే!

రిలయన్స్ జియో వ్యూహ మరియు మార్కెట్ విభాగాధికారి అన్షుమన్ ఠాకూర్ జియో ఫోన్ వాడకాన్ని గురించి కొన్ని షాకింగ్ విషయాల్ని బయటపెట్టారు. ప్రస్తుతం దేశంలో 2.5 కోట్ల జియో ఫోన్ వినియోగదారులున్నారనీ, వారు సగటున నెలకు 7జీబీ డేటా వాడుతున్నట్లు తెలిపారు. ఇదిలా వుండగా జియో సేవలను ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో వాడేవారు సగటున నెలకు 10జీబీ నే వాడుతున్నారట!

యూట్యూబ్, వాట్సాప్ లాంటి అప్లికేషన్లు లేకుండా జియో ఫోన్ వినియోగదార్లు నెలకు కేవలం రూ.49/-తో 7జీబీ వాడుతుండగా, స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లు నెలకు 399 నుండి 500 వరకు చెల్లిస్తూ, అన్ని అప్లికేషన్లనూ కలిగి వుండి కేవలం 10జీబీనే వాడుతుండడం గమనార్హం. అంతేగాక రోజుకు జియో ఫోన్‌ను సగటున 5 గంటలపాటు వాడుతున్నట్లు తెలిపారు.

టెలికాం రంగం మొత్తం వినియోగదారుల వాడకాన్ని పరిశీలిస్తే సగటున నెలకు 2జీబీ డేటాను మాత్రమే వినియోగిస్తున్నారు. ఇటీవల ముకేష్ అంబానీ ప్రకటించిన “మాన్సూన్ హంగామా ఆఫర్“తో జియో ఫోన్ వినియోగదార్లు ఇంకా పెరుగుతారనీ, త్వరలో రానున్న జియో ఫోన్2 యూట్యూబ్, వాట్సాప్ అప్లికేషన్లు కూడా వాడుకునే విధంగా వస్తుండడంతో ఫీచర్ ఫోన్ వినియోగదారులు కూడా డేటాను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారనీ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు..

Leave a Comment