టెక్నాలజీ తెలుగు వార్తలు

ఇప్పుడు వాట్సాప్‌లోనే మీ రైలు ఎక్కడుంది తెలుసుకోవచ్చు!

వాట్సాప్ మెసెంజర్లో గత కొన్ని నెలల నుండి Business ప్రొఫల్స్‌ను అనుమతించిన విషయం తెలిసిందే. ఇప్పటికే BookMyShow, Swiggy వంటి వ్యాపార సంస్థలు వినియోగదారులకు ఆఫర్లు, సమాచారాన్ని ఈ బిజినెస్ ప్రొఫైల్స్ ద్వారా చేరవేస్తున్నాయి.

Train Live Status on WhatsApp Chat

కాగా ఇప్పుడు MakeMyTrip సంస్థ IRCTCలో చూడగలిగే రైలు స్టేటస్‌ను వాట్సాప్ మెసెంజర్లోనే చూడగలిగే వెసులుబాటు కల్పించింది. దీని ద్వారా రైలు ఎక్కడుంది, ఎంత సమయం ఆలస్యంగా వస్తుంది లాంటి వివరాలు ఏ ఇతర అనువర్తన (Application) అవసరం లేకుండా సులభంగా తెలుసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం.

వాట్సాప్ మెసెంజర్లో రైలు ఎక్కడుందో ఎలా చూడాలి?

  • ముందుగా 7349389104 అనే నంబరును మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో “Train Status” అనే పేరుతో (లేదా మీకు నచ్చిన పేరుతో) జతపరచుకోండి.
  • ఇప్పుడు వాట్సాప్ మెసెంజర్ తెరిచి అందులో కొత్త చాట్‌లో Train Status ను తెరవండి.
  • మీరు తెలుసుకోవాలనుకుంటున్న రైలు నంబరు లేదా PNR నంబరును మెసేజ్ చేయండి. కొన్ని క్షణాల్లోనే ఆ రైలు ఎక్కడుంది, తదితర వివరాలు ప్రత్యక్షమవుతాయి.

(పక్కన చూపించిన చిత్రంలోలా చేస్తే సరిపోతుంది)

గమనిక: ఈ సదుపాయాన్ని MakeMyTrip సంస్థ అందిస్తోంది. MakeMyTrip సైట్ ద్వారా చేసుకున్న బుకింగ్/వాపసు/రద్దు వివరాలను ఇవ్వడానికి ఈ వాట్సాప్ నంబరును అందుబాటులోకి తీసుకురాగా మనం ఇక్కడ చెప్పుకున్న రైలు వివరాలు వారు అందిస్తున్న అదనపు సదుపాయం మాత్రమే.

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment