Banks & Payments జ్ఞానం తెలుగు

నామినీ లను ఏర్పాటుచేసేప్పుడు జాగ్రత్త!

బ్యాంకులతో మొదలు మ్యూచువల్ ఫండ్, షేర్ మార్కెట్ వరకు అన్ని అకౌంట్లకూ ప్రారంభించేటప్పుడు నామినీలను ఇస్తుంటాం.  కొంతమందైతే తర్వాత ఇవ్వొచ్చులే అని నామినేట్ కూడా చేయరు.  ఏ పెట్టుబడికైనా నామినీలు చాలా ముఖ్యం.  చాలామంది ఏదో ఒక పేరులే అని నచ్చిన వ్యక్తి పేరు ఇచ్చేస్తారు.  పెట్టుబడిరంగంలోని నిపుణులు ఇది చాలా తప్పనిఅంటున్నారు.

నామినీ ఏర్పాటు చేసామంటే అతను మీతర్వాత ఆ పెట్టుబడికి యజమాని (లీగల్ హేర్) అని గుర్తించాలి.  వారసులు / వీలునామా లేకుంటేనే ఆ పెట్టుబడి నామినీకు చెందుతుంది.  నామినీని ఏర్పరచేప్పుడు అతను/ఆమె మీవయసు లేదా మీకంటే తక్కువ వయసు ఉండేలా చూసుకోవడం మంచిది.

కొంతమంది నామినీగా తమ కూతురి పేరు పెడుతుంటారు.  పెళ్ళైన తరువాత వారి ఇంటిపేరు మారుతుంది. నామినీ రికార్డుల్లో ఆ పేరు మార్చకపోతే ఆమెకు ఆ డబ్బు చెందదు!

అలాగే పేర్లలో వ్యాకరణదోషాలు (స్పెలింగ్ మిస్టేక్స్) లేకుండా చూసుకోవాలి. ఏ ఒక్క అక్షరం తప్పున్నా ఇబ్బందే!  మ్యూచువల్ ఫండ్స్ లో మూడు పేర్ల వరకు నామినేట్ చేసుకోవచ్చు.  ఈ నామినీ పేర్లను పెట్టుబడి చేసిన వ్యక్తి అనుమతితో మార్చవచ్చు, తీసేయవచ్చు.  మైనర్ పిల్లలను కూడా నామినేట్ చేయవచ్చు కానీ ఈ కేసులో గార్డియన్ తప్పనిసరిగా ఉండాలి.  పిల్లలు మేజర్ అయ్యేనాటికి గార్డియన్ వారితోపాటు ఉండాలి.

ఏ పరిస్థితుల్లో అయినా వీలునామా రాసి ఉంచడం మంచిది.  ఇది మీ పెట్టుబడిని మీ వారసులకు / మీరు అనుకున్నవారికి చెందేలా ఉపయోగపడుతుంది.  కాబట్టి మీ పెట్టుబడికి నామినీలను తగిన జాగ్రత్తలతో తప్పనిసరిగా నామినేట్ చేయండి.

గమనిక: WhatsApp, Telegramలలో మా అప్డేట్స్‌ను పొందేందుకు http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog ఛానళ్ళలో చేరండి.

avatar
  Subscribe  
Notify of