టెక్నాలజీ

మనదేశంలో ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ సైట్లను బ్యాన్ చేయబోతున్నారా?

నిన్నటినుండీ ఫేస్బుక్, వాట్సాప్ లాంటి అన్ని సోషల్ మీడియా సైట్లను ప్రభుత్వం బాన్ చేయబోతోందని రకరకాల పుకార్లు అవే ఫేస్బుక్, వాట్సాప్ లలో షేర్ అవుతూ వున్నాయి.  దాని సారాంశం ఏమంటే భారత ప్రభుత్వం టెలికాం శాఖకు ఒక లేఖ రాసిందనీ, దాని ప్రకారం ఇక మన దేశంలో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టా లాంటి సోషల్ సైట్లన్నింటినీ బాన్ చేయమని చెప్పినట్లు ప్రచారమవుతుంది. దీన్ని నమ్మి గుడ్డిగా వాట్సాప్ లో చాలామంది ఆ పుకారును షేర్ చేస్తున్నారు.

నిజానికి ఇది అవాస్తవం. ప్రభుత్వం కేవలం ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఇలాంటి సోషల్ నెట్వర్క్ సైట్లన్నింటినీ నియంత్రించే అవకాశం ఉండాలనీ, అందుకు కావలసిన మార్గాలన్నింటినీ సిద్ధం చేసుకోవాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వాడకం భారీ స్థాయిలోపెరగడం, అందులో విచ్చలవిడిగా పుకార్లను కూడా అమాయకంగా షేర్ చేయడం, దానివల్ల అనేక అనర్థాలు జరగడం వింటూనే ఉన్నాం. ఒకవేళ దేశంలో ఏదైనా ఎమెర్జెన్సీ విధించినా, ఎలక్షన్ల సమయంలో పుకార్లను ఆపడానికి, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో సోషల్ మీడియాను నిర్బంధించడానికి కావలసిన సదుపాయాల్ని సిద్ధంగా ఉంచాలని మాత్రమే ప్రభుత్వం ఆదేశించింది. సో, సోషల్ మీడియాను బాన్ చేస్తారన్న వార్త కేవలం పుకారు మాత్రమే. నమ్మకండి.

Leave a Comment