టెక్నాలజీ తెలుగు

ఇక ఐఫోన్లు రెండు సిమ్ కార్డులతో రాబోతున్నాయి

అవును..ఇకమీదట ఐఫోన్ రెండు సిమ్ కార్డులతో రానుంది. ఎప్పటినుండో ఐఫోన్ వినియోగదారులు బాధపడే ముఖ్యమైన విషయాల్లో ఇదొకటి.  లక్ష రూపాయలు వెచ్చించి ఐఫోన్ కొన్నా ఒక్క సిమ్ కార్డు మాత్రమే వాడుకోగలిగే పరిస్థితి.  యాపిల్ సంస్థ మొదట్లో రెండు సిమ్ కార్డుల విధానంపై ఆసక్తి కనబరచకపోయినా ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి యాపిల్ తమ విధానాలను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా విడుదలైన iOS 12 డెవలపర్ బీటా 5 లో ఉన్న కోడ్‌లో ఈ రెండవ సిమ్ గురించి ప్రస్తావించబడింది. “సిమ్ ట్రే స్టేటస్”, “సెకండ్ సిమ్ ట్రే స్టేటస్” అనే పదాలు ఈ కోడ్ లో వున్నాయి.  దీనిప్రకారం రెండు సిమ్ కార్డులకూ రెండు ట్రేలు ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రింది కోడ్ లో మీరా విషయం గమనించవచ్చు. సో, ఇకపై రాబోయే ఐఫోన్లలో రెండు సిమ్ కార్డులు వాడుకోగలరన్నమాట!

ఈ విషయమై యాపిల్ సంస్థ అధికారికంగా ఏ ప్రకటన చేయనప్పటికీ తదుపరి విడుదల చేసే ఐఫోన్లలో ఖచ్చితంగా రెండు సిమ్ కార్డులు రానున్నట్లు మాత్రం స్పష్టమయినట్లే. ఒకవేళ మీరు ఐఫోన్ కొనదలచుకుంటే తదుపరి ఐఫోన్ విడుదలయ్యేదాకా వేచివుండడం మంచిది.

Leave a Comment