టెక్నాలజీ తెలుగు

వాట్సాప్‌లో గ్రూప్ కాల్స్ సదుపాయం వచ్చేసింది..వాడడం ఎలా?

నిన్న రాత్రి (30 జూలై 2018) నుండి వాట్సాప్ మెసెంజర్‌లో గ్రూప్ వాయిస్ కాల్స్ / వీడియో కాల్స్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు మీరు ఒకేసారి ఒకరితో మాత్రమే కాల్ మాట్లాడడానికి కుదిరేది. ఇప్పుడు ఒకేసారి నలుగురితో మాట్లాడవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం:

వాట్సాప్ గ్రూప్ కాలింగ్ సదుపాయాన్ని వాడటం ఎలా?

Whatsapp Group Calling – Screenshots

  • ముందుగా వాట్సాప్ అనువర్తనాన్ని తెరిచి కాల్స్ విభాగానికి వెళ్ళండి.
  • డైలర్ చిహ్నంపై నొక్కి ఒకరికి కాల్ చేయవలసి వుంటుంది. ఆ కాల్ కలిసాక పైన “+” గుర్తుపై నొక్కి మరొకరిని కాల్ లోకి జతపరచవచ్చు. ఇలా ఒకేసారి నలుగిరిని జతపరచుకుని మాట్లాడవచ్చు.

వాట్సాప్ మెసెంజర్ 2016లో కాలింగ్ సదుపాయం తీసుకురాగా ఇప్పుడు రెండు సంవత్సరాల తరువాత గ్రూప్ కాలింగ్ (వాయిస్ / వీడియో) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు వున్న వాయిస్ కాలింగ్ సదుపాయం ద్వారా ప్రపంచవ్యాప్తంగా రోజుకు 200 కోట్ల నిముషాలు మాట్లాడుకుంటున్నారని వాట్సాప్ సంస్థ తెలిపింది.

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment