టెక్నాలజీ

గూగుల్ మ్యాప్స్ మనదేశంలో ఈ సదుపాయాల్ని మెరుగుపరుస్తోంది

ఇటీవలె ద్విచక్ర వాహనాల కోసం మ్యాప్స్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన గూగుల్ మ్యాప్స్ తాజాగా భారతదేశ వినియోగదారులకోసం మరికొన్ని సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

గూగుల్ మ్యాప్స్ ఇండియా మేనేజర్ ఘోష్ – గూగుల్ మ్యాప్స్ కేవలం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్గం చూపేందుకు మాత్రమే కాదన్నారు. మ్యాప్స్‌కు సంబంధించి ఏ సదుపాయమైనా గూగుల్ మ్యాప్స్‌లో ఖచ్చితమైన, నమ్మకమైన ఫలితాలతో అందించడమే తమ లక్ష్యమన్నారు.

మనదేశంలో రిజిస్టర్ కాబడిన వాహనాల మొత్తంలో 70 శాతానికి పైన ద్విచక్ర వాహనాలే అనీ, దీనిని దృష్టిలో వుంచుకుని భారతదేశంలో “టూ-వీలర్ మోడ్”ను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. దీనిద్వారా కార్లు, బస్సులు వెళ్ళలేని చిన్న రోడ్లను ఉపయోగించి ద్విచక్ర వాహందారులు తక్కువ దూరంలో త్వరగా గమ్యస్థానానికి చేరవేసేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందన్నారు. ట్రాఫిక్ వివరాలు, గమ్య స్థానానికి చేరుకోగల సమయ అంచనా కూడా ద్విచక్ర వాహనదారులకు అందుబాటులో వుంచామన్నారు.

12000 పైగా రైళ్ళ రాకపోకల వివరాలు గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పటికే అందుబాటులో వున్నాయనీ, దీనిని మరింత మెరుగుపరచున్నట్లు చెప్పారు. బస్సులు, మెట్రో రైళ్ళు ఇతర ప్రజా రవాణాకు సంబంధించిన వివరాలు కూడా మరింత ఖచ్చితంగా వుంటాయన్నారు. కలకత్తా, సూరత్ నగరాల్లో బస్సుల రాకపోకల వివరాలు రియల్‌టైంలో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

అంతేకాక, మూత్రశాలల వివరాలు కూడా గూగుల్ మ్యాప్స్‌లో మరింత ఖచ్చితత్వంతో అందుబాటులోకి వస్తాయనీ, దీనికిగానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీసుకుంటున్నామని తెలిపారు.

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment