ఈకామర్స్ వార్తలు

అమేజాన్ ప్రైంకు పోటీగా, ఉచితంగా “ఫ్లిప్‌కార్ట్ ప్లస్” ప్రారంభం

వాల్‌మార్ట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకున్న తరువాత ఆ సంస్థ నుండి వచ్చిన భారీ ప్రకటన ఇదే. ఇప్పటికే అమేజాన్ సంస్థ భారీ స్థాయిలో కొత్త “ప్రైం” కష్టమర్లను పొందుతున్న సమయంలో ఫ్లిప్‌కార్ట్ ఈ సంచల ప్రకటన చేసింది. ఈ ఆగష్టు 15 నుండి “ఫ్లిప్‌కార్ట్ ప్లస్” పేరిట లాయాలిటీ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలిపింది. అదికూడా పూర్తి ఉచితంగా తమ వినియోగదారులకు అందిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కార్యక్రమం ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులందరికీ ఉచితంగానే లభిస్తుంది. దీనివల్ల ఫ్లిప్‌కార్ట్‌లో ఏ వస్తువు కొనుగోలు చేసినా కొన్ని “ప్లస్ పాయింట్స్”ను పొందుతారు. ఈ ప్లస్ పాయింట్లను తదుపరి కొనుగోళ్ళ కోసం వాడుకోవచ్చు. అంతేకాక అమేజాన్ ప్రైం ఎలాగైతే కొన్ని ఫోన్లు/డీల్స్‌ను కేవలం ప్రైం సబ్స్క్రైబర్స్‌కే అందిస్తుందో అదే విధంగా ఈ “ప్లస్” వినియోగదారులకు అందించనుంది.

ప్రైం వీడియో, ప్రైం మ్యూజిక్ పేరిట కంటెంట్ స్ట్రీమింగ్ రంగంలో కూడా అమేజాన్ సేవలందిస్తున్నందున ఫ్లిప్‌కార్ట్ సంస్థ వీడియో స్ట్రీమింగ్ కోసం హాట్‌స్టార్ సంస్థతో, ట్రావెల్ సదుపాయలను అందించడం కోసం MakeMyTripతో, సినిమా టికెట్లను అందించేందుకై BookMyShow తదితర సంస్థలతో కూడా భాగస్వామ్యమవ్వనున్నట్లు తెలిపింది. “ఫ్లిప్‌కార్ట్ ప్లస్” వినియోగదారులకు ఉచిత డెలివరీ సౌకర్యాన్ని కూడా అందించనుంది.

అమేజాన్ ప్రైం సబ్స్క్రిప్షన్ సంవత్సరానికి రూ.999/-, నెలకు రూ.129/-కి ప్రస్తుతం లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మాత్రం ఉచితంగానే లభించనుంది. ప్రతియేటా Big Billion Days పేరిట సరికొత్త ఆఫర్లను అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్ ఈసారి తమ “ప్లస్” వినియోగదారులకు కాస్త ముందుగానే ఆ డీల్స్‌ను అందించనుంది.

వాల్‌మార్ట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకున్న తరువాత ఈకామర్స్ రంగంలో దూసుకెళ్తున్న అమేజాన్‌ను అడ్డుకట్ట వేయడానికి అడుగులు మొదలుపెట్టిందనే చెప్పాలి. భారతదేశంలో అందుబాటులో లేని అనేక కొత్త వస్తువులను కూడా వాల్‌మార్ట్ సాయంతో ఫ్లిప్‌కార్ట్‌ద్వారా అందుబాటులోకి రాబోతున్నాయి కూడా.

ఈ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించినప్పటికీ అది అందరికీ ఆటోమాటిక్‌గా వస్తుందా అన్న వివరాలను ఇంకా తెలియలేదు. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు వెలువడనున్నాయి.

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment

1 Comment