సోషల్ మీడియా

ఫేస్‌బుక్‌లో డేటింగ్ ప్రొఫైల్స్ రాబోతున్నాయ్

Tinder, Bumble, OKCupid, Happn, Grinder లాంటి డేటింగ్, వర్చువల్ రిలేషన్స్ కు సంబంధించి కుప్పలు తెప్పలుగా కొత్త అనువర్తనాలు (Applications) వచ్చిపడుతున్న సమయంలో డేటింగ్ సదుపాయాన్ని తాము కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. నిజానికి మే నెలలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినా వివరాలేవీ తెలియలేదు. తాజాగా అప్లికేషన్లపై పరిశోధన చేసే ఒకామె తన ట్విట్టర్ ఖాతాలో ఫేస్బుక్ పరీక్షిస్తున్న డేటింగ్ సదుపాయానికి సంబంధించిన తెరపట్లను (Screenshots) ట్వీట్ చేసింది.

ఇటీవల ఫేస్బుక్ బ్లాగులో తెలిపిన ప్రకారం ఈ డేటింగ్ సదుపాయం మీరిప్పటికే వాడుతున్న ఫేస్బుక్ ప్రొఫైల్ కు విభిన్నమైనది. మీరు డేటింగ్ కోసం ప్రత్యేక ప్రొఫైల్ ను సృష్టించుకోవలసి ఉంటుంది. ఈ ప్రొఫైల్లో నింపిన అలవాట్లు, మ్యూచువల్ ఫ్రెండ్స్, ప్రాధాన్యతలను బట్టి తగిన సిఫారసులను చూపిస్తుంది. అయితే ఈ డేటింగ్ ప్రొఫైల్లోని యాక్టివిటీ ఫేస్బుక్ ప్రొఫైల్లోచూపించబడదు, అంటే మీ ఫేస్బుక్ ప్రొఫైల్లోని స్నేహితులు మీ డేటింగ్ ప్రొఫైల్లోని మీ యాక్టివిటీని చూడలేరు. ఎవరెవరు మీ డేటింగ్ ప్రొఫైల్ ను చూడవచ్చు, ఎవరెవరిపై మీకు ఆసక్తి వుంది అనే విషయాలపై ఎంపిక కూడా పూర్తిగా వినియోగదారుడి స్వేచ్ఛకే వదిలేసింది.

ఇద్దరు వ్యక్తులు పరస్పరం తమ డేటింగ్ ప్రొఫైల్స్ పట్ల ఆసక్తి చూపితే వారిరువురూ ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా లేదా వాట్సాప్ మెసెంజర్ ద్వారా చాట్ చేసుకునే వెసులుబాటుకూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ డేటింగ్ సదుపాయాన్ని ఫేస్బుక్ తమ సంస్థలోని ఉద్యోగులపై పరీక్ష చేస్తుంది. మొదట్లో దీనిని అమెరికా వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చి దశలవారీగా మిగతా ప్రాంతాల్లోకూడా అందుబాటులోకి తీసుకురానుంది.

Jane Manchun Wong అనే ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా డేటింగ్ సదుపాయానికి సంబంధించి చేసిన ట్వీట్:

మీ నెలలో ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ తెలిపిన వివరాలు:

 

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment