టెక్నాలజీ

బయటి వీడియోలు కూడా ఇక వాట్సాప్‌లోనే ప్లే అవుతాయి

వాట్సాప్ మెసెంజర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకి మరో కొత్త సదుపాయం రాబోతోంది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఏదైనా యూట్యూబ్ వీడియోని షేర్ చేస్తే అది ఒక లింకుగా చూపించబడుతుంది. ఆ లింకుపై క్లిక్ చేస్తే యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ అవ్వడమో, బ్రౌజర్‌లో ఓపెన్ అవ్వడమో జరుగుతుంది. ఇకమీదట ఈ అవసరం లేదు!

గత రెండు నెలలుగా వాట్సాప్ సంస్థ యూట్యూబ్, ఇన్స్టాగ్రాం లాంటి థర్డ్-పార్టీ వీడియోలను వాట్సాప్ అప్లికేషన్‌లోనే ప్లే అయ్యే విధంగా మార్పులు చేస్తుంది. సో, ఇక మీదట యూట్యూబ్, ఇన్స్టా వీడియోలు కూడా వాట్సాప్‌లోనే ప్లే అవుతాయి. అంతే కాదు, మీరు ఆ వీడియో చూస్తూ కూడా చాటింగ్ చేసుకోవచ్చు! దీనికోసం వాట్సాప్ picture-in-picture టెక్నిక్‌ను వినియోగిస్తుంది. దీనివల్ల మీరు చాటింగ్ చేసుకుంటున్నప్పుడే తెరలో ఒక చిన్న బాక్స్‌లో వీడియో ప్లే అవుతుంది. ప్రస్తుతం మీరు యూట్యూబ్ అప్లికేషన్లో ఏదైనా వీడియో చూస్తూ బ్యాక్ బటన్ నొక్కితే ఒక చిన్న బాక్స్‌లో వీడియో ప్లే అవుతుందికదా, అలాంటి బాక్సే వాట్సాప్‌లో కూడా రాబోతుంది.

దీనికి సంబంధించి ఇటీవలె ఒక కొత్త బీటా వర్షన్‌ను (2.18.234) ప్లే స్టోర్‌కు పంపింది. ఈ వర్షన్లో కొన్ని బగ్స్ కారణంగా అందరికీ అందుబాటులోకి తేలేకపోయిందనీ, అతి త్వరలోనే రానున్న వర్షన్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి వస్తుందని WhatsAppBetaInfo ఒక టపాలో తెలిపింది.

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment