www.bookchor.com సెకండ్ హ్యాండ్ పుస్తకాల అంగడి కథ

అన్ని దానాలలోకెల్లా గొప్ప దానం విద్యాదానం. విద్య అంటే..? జ్ఞానం.  జ్ఞానం సంపాదించడానికి చాల మార్గాలున్నాయి. సొంత అనుభవాలు, ఉపాద్యాయుల పాఠాలు, తల్లిదండ్రులు చెప్పే మాటలు ఇంకా చాలా ఉన్నాయి.

అలాగే పుస్తకాలు.

మనలో చాలా మందికి ఒక పుస్తకం కొనుక్కోడం పెద్ద విషయం కాదు. ఒక వేళ ఆ పుస్తకం కొనడానికి shop కి వెళ్లి సరిపడా డబ్బులు లేక వెనక్కి వెళ్ళిపోవడం కన్నా దురదృష్టం ఉండదు.

మరెలా…??! అనే ఆలోచన వచ్చిందో ఏమో వీళ్ళకి ఇలా చేసారు.

ఏం చేసారు..??

ఆ ఆలోచనని ఆలోచనలా ఒదిలెయ్యలేదు. ఆలోచించారు. ఆ ఆలోచనల్లోనుంచి ఒక ఐడియా. అదే www.buymebook.com అదే ఇప్పుడు www.bookchor.com . కంగారు పడకండి. వీళ్ళు బుక్స్ ని దొంగలించారు. బుక్స్ చదివే వాళ్ళ మనసులని దొంగాలిస్తారు.

మీ దగ్గర పుస్తకాలు ఉంటే వాటిని ఇందులో అమ్మచ్చు. ఇందులో ఉన్న పుస్తకాలు మీరు కొనుక్కోవచ్చు. కొన్న పుస్తకాలు చిరిగినా, పాడయినా, బాలేకపోయినా వాటిని 15 రోజుల లోపు తిరిగి ఇయ్యవచ్చు.

అసలు కథేంటో చూద్దాం.

ఆలోచన ఆచరణగా మారింది: 

bookchor team

అవి సెలవులు ఐపోయి కాలేజిలు తెరిచే రోజులు. చాలా పనులుంటాయి. అలాగే పుస్తకాలూ కొనాలి. కానీ కొత్త పుస్తకాలే ఎందుకు.. పాత పుస్తకాల్లోనూ అదే కదా ఉండేది అని చాలా మంది ఖర్చు తక్కువ కదా సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుక్కోడానికి మొగ్గు చూపుతారు. అలాగే భవిష్ శర్మ, ప్రతీక్ మహేశ్వర్, అలోక్ రాజ్ అనే దిల్లి కి చెందినా ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్దులు సెకండ్ హ్యాండ్ పుస్తకాల కోసం దిల్లిలోని దర్యాగంజ్ ప్రదేశానికి వెళ్లారు. మనకి హైదరాబాద్ కోటి, విజయవాడ లెనిన్ నగర్ ఎలాగో డిల్లీ వాళ్లకి దర్యాగంజ్ అలాగ.  వాళ్ళకి కావలసినవి కొనడానికి రోజంతా పట్టింది కానీ ఆ పుస్తకాలు అంతగా ఎం బాలేవు. కొన్ని చినిగిపోయి, కొన్నిట్లో కాగితాలు మిస్ అయి ఉన్నాయి.

సెకండ్ హ్యాండ్ పుస్తకాల విషయం లో వీరికి సంతృప్తిగా అనిపించలేదు. అందుకే ఒక రోజు కాంటీన్ లో సిట్టింగ్ ఎసారు. ఒకటి అనుకున్నారు. వాళ్ళ కాలేజ్ పరిదిలో ఒక వెబ్ సైట్ ని ప్రారంభించారు. సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనాలి అనుకునే వాళ్ళు వాటి వివరాలను ఆ వెబ్ సైట్లో నమోదు చేస్తే ఈ ముగ్గురే వాటిని సంపాదించి వారికీ అందించే వారు.

buymebook.com to bookchor.com

buymebook.com to bookchor.com

పై ఐడియా క్లిక్ ఐంది. అంతే ఇక ఆగలేదు. 2015 అక్టోబర్ లో buymebook.com పేరుతో ఒక కొత్త వెబ్ సైట్ ని ప్రారంబించారు. అంతా బాగుంది కాని వెబ్ సైట్ పేరే కొత్తగా పెడదామనుకున్నారు. అప్పుడే ఈ buymebook.com ని bookchor.com గా మార్చారు.

పెట్టుబడి:

ఐడియా బాగుంది. ఆదరణ వస్తుంది. కానీ దీన్ని వ్యాపించాలి. కానీ యువకులు. అందులోనూ విద్యార్దులు. డబ్బులెక్కడివి. చాలా ప్రయత్నించారు. కానీ డబ్బులు సర్దుబాటు కాలేదు. విసిగిపోయారు. చివరకి భవిష్ తల్లితండ్రులు వారి మీదా, వారి ఐడియా మీద నమ్మకంతో 34 లక్షల రుపాయలిచ్చారు.

ముగ్గురు నుండి నలుగురు.

అల్జీరియాలో ఉద్యోగం చేస్తున్న భవిష్ వాళ్ళ భావ విద్యుత్ శర్మ ఉద్యోగం మానేసి వీరితో చేతులు కలిపారు.

మొదటి ఒప్పందం

ఈ కామర్స్ వెబ్ సైట్ ని మొదలుపెట్టి దిల్లి, ముంబాయిలోని సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్మే షాప్ వాళ్ళతో మాట్లాడి వారికీ పుస్తకాలూ అందించాలని ఒక ఒప్పందానికి ఒచ్చారు.

మార్కెటింగ్, ప్రకటనలు

మార్కెటింగ్ కి కూడా డబ్బుల్లేవ్. ఇలా కాదని వీరే స్వయంగా స్కూల్స్ లో పుస్తకాలను ప్రదర్శించడం మొదలుపెట్టారు. అంతేకాక పుస్తకాలూ కొనే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా గ్రీటింగ్ కార్డు లని పంపేవారు. కొత్తగా ఉండడం వాళ్ళ వీరికి గుర్తింపు వచ్చింది. తర్వాత పాఠ్యపుస్తకాలతో పాటు నవలలు, కథలు, ఇతర పుస్తకాలను అమ్మడం ప్రారంబించారు.

నంబర్లు మారాయి

రెండేళ్లలో వెబ్ సైట్ ని సందర్శించే వారి సంఖ్య మూడు లక్షలు అయింది.

ప్రస్తుతం వీరి దగ్గర నలుగు లక్షల పుస్తకాలున్నాయి.

సంవత్సరానికి మూడుకోట్ల రూపాయల టర్నోవర్ వస్తుంది.

bookchor ప్రత్యేకత

మార్కెట్ లో చాలా సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాపులు ఉన్నావీరు అందించే పుస్తకాలు పాత పుస్తకాల్లా అస్సలు అనిపించవు. చిరుగులు ఉండవు. అచ్చం కొత్త వాటిలా ఉంటాయి. వాటిని కూడా చాలా తక్కువ ధరలకే అమ్ముతారు. ఆన్లైన్ లో పుస్తకాలు ఆర్డర్ ఇస్తే సాధారణంగా ఒక వారం లో మీ ముందు ప్రత్యక్షమవుతాయి. కొనడం అమ్మడమే కాకుండా ఎవరినా పుస్తకాలు దానం చేస్తే వాటిని పేద విద్యార్ధులకి పంచుతారు. ఇలా గత సంవత్సరం పదివేల పుస్తకాలని సేకరించి ఇచ్చారు. అందుకే ఈ వెబ్ సైట్ ప్రత్యేకమైనది. bookchor మొబైల్ అప్లికేషన్ కూడా ఉందండోయ్. డౌన్లోడ్ లింక్

లాక్ ది బాక్స్ Lock the Box

ఈ సంస్థ కేవలం వెబ్ సైట్ కే పరిమితం కాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో పుస్తక ప్రదర్శనలు పెడతారు. ఈ ప్రదర్శనలలో మూడు వేర్వేరు సైజు ఉన్న అట్టపెట్టెలు ఉంటాయి. ఒక్కొక పెట్టెకి ఒక నిర్ణిత ధర ఉంటుంది. మనం మనకి కావలసిన పుస్తకాలని ఆ అట్టపెట్టెలలో ఎన్ని పడితే అన్ని పుస్తకాలని ఆ పెట్టె కి నిర్ణయించిన ధర చెల్లించి తీసుకెల్లచ్చు. ఈ Lock the Box కుడా మంచి ఆదరణ పొందింది.

Lock the box – Bookchor

రాబోయే Lock the Box కార్యక్రమాల వివరాలు: https://www.bookchor.com/Lock-The-Box

 

Leave a Reply