టెక్నాలజీ

ఆండ్రాయిడ్ “పై” లో ఈ సూపర్ ఫీచర్స్ వచ్చేసాయి

గత ఆరు నెలలుగా Android P గా పిలువబడుతున్న ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ కు నేడు అధికారికంగా Android Pie గా పేరును ప్రకటించారు. ఆండ్రాయిడ్ లాలీపాప్ వర్షను తరువాత చెప్పుకోదగ్గ పెద్దమార్పులతో వస్తుంది ఈ “పై” వర్షనే. ఈరోజే అధికారికంగా Google Pixel ఫోన్లకు ఈ OS విడుదలకాగా, Xioami, Nokia, Vivo, Oneplus లలోని కొన్ని ఫోన్లకు కూడా అతిత్వరలోనే ఈ “పై” వర్షను విడుదలకాబోతుంది. ఈ “పై”లో ఏఏ సదూపాయాలుందబోతున్నాయో ఇక్కడ చూద్దాం:

Digital Wellbeing:

ఈ వర్షన్లోని మేజర్ హైలైట్ ఇదే. స్మార్ట్ ఫోన్ ను ఎలా వాడుతున్నాం, ఎంత సేపు వాడుతున్నాం, మితిమీరిన వాడకాన్ని నియంత్రించడానికి ఈ “Digital Wellbeing” ఏ సమాధానం. మీరెంచుకున్న కొన్ని అప్లికేషన్లపై రోజుకు ఎంత సమయం వెచ్చిస్తున్నారో ఈ “Digital Wellbeing Dashboard” ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫలానా అప్లికేషన్ ను ఇంత సమయం కన్నా ఎక్కువసేపు వాడకూడదనుకుంటే అలా కూడా సమయాన్ని సెట్ చేయొచ్చు. ఆ సమయం అయిపోయాక ఆ అప్లికేషన్ కు సంబంధించి ఐకాన్ బూడిద (Gray) రంగుకు మారుతుంది. దాన్ని బట్టి మీరు అనుకున్న సమయాన్ని అప్పటికే వాడారని విషయాన్ని గుర్తించొచ్చు.

తరచూ వాడని అప్లికేషన్లను నియంత్రించి బ్యాటరీని ఆదా చేస్తుంది

మీరు ఎక్కువగా వాడని అప్లికేషన్లను బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వకుండా నియంత్రిస్తుంది. ఉదాహరణకు MyJio, MyAirtel లాంటి అప్లికేషన్లను మనం ప్రతిరోజూ వాడం, అయినా కూడా బాక్గ్రౌండ్ లో అవి రన్ అవుతూ బ్యాటరీని డ్రైన్ చేస్తుంటాయి. ఆండ్రాయిడ్ పై లో ఈ వాడని అప్లికేషన్లు బాక్గ్రౌండ్ లో రన్ అవ్వకుండా ఆటోమేటిక్ గా నియంత్రిస్తుంది.

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ను ఉపయోగిస్తుంది:

AI ద్వారా మీరు మీ ఫోన్ ను ఎలా వాడుతున్నారో తెలుసుకుంటూ దానికి తగ్గట్టు సహాయపడబోతుంది. మీరు రోజూ ఏ టైం కి, ఎంత వెలుగున్నప్పుడు Brightness ను మారుస్తున్నారో గుర్తించి అందుకు తగ్గట్లుగా Brightness ను మెయింటైన్ చేస్తుంది.  అలాగే యాప్ డ్రాయర్ లో మీరు తరచూ వాడే అప్లికేషన్లను పైన చూపిస్తుంది. 

అప్లికేషన్లను మారడం ఇక మరింత సులభం

ఈమధ్యకాలంలో Curved తెరలు, Bezel display లు పెరుగుతుండడంతో ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఇకపై ప్రతీసారి Recent Apps బటన్ ను నొక్కి మారాల్సిన పనిలేదు. కేవలం ఫోన్ చివర అంచులను స్వయిప్ చేస్తే చాలు.  మునుపటి, తర్వాతి అప్లికేషన్లకు సులభంగా మారవచ్చు.

Pie Slices

ఈ సదుపాయం కూడా అతిముఖ్యమైనది. ఉదాహరణకు మీరు Uber క్యాబ్ బుక్చేయాలనుకుంటే, Uber తెరిచే ముందే అప్లికేషన్ పక్కన డ్రైవర్ 2 నిమిషాల దూరంలో ఉన్నారని చూపిస్తుంటుంది. అలాగే మీ ఇంటికి వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది, ఎంత ధర అవుతుంది తదితర వివరాలు కూడా అప్లికేషన్ తెరవకుండానే తెలుస్తాయి. దానిపై క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా క్యాబ్ బుక్ అయిపోతుంది. ఇలా చాలా పనులు అప్లికేషన్ తెరిచే పని లేకుండానే పూర్తవుతాయి.

గమనిక: “Digital Wellbeing” సదుపాయం ఇంకా బీటా దశలోనే వుంది. ఈరోజు పిక్సెల్ ఫోన్లకు విడుదలైన “పై” వర్షన్ ఈ సదుపాయం పూర్తిస్థాయిలో అందుబాటులోలేదు. అయినా పిక్సెల్ వినియోగదారులు ఈ సదుపాయాన్ని పొందడానికి బీటాను ఇన్స్టాల్ చేసుకుని పొందవచ్చు.

Leave a Comment