గురించి

“ఆవో” ఒక వికేంద్రీకృత సమూహము.  బహుశా ప్రపంచంలోనే మొదటిదని మా నమ్మకం. ఈ సమూహంలో సభ్యులు, అధికారులు అంటూ ఎవరూ వుండరు.  చేరికలూ వుండవు.  ఆవో సమూహంలో అందరూ స్వచ్చంద సేవకులే.

మనచుట్టూ ఉన్న పరిస్థితుల్ని  మెరుగుపరచాలని చాలామందికి ఉంటుంది.  కానీ ఒక మార్పుకోసం చాలాసార్లు ఒక “సమూహం” అవసరమవుతుంది. అది ఏ మార్పైనా కావొచ్చు. ఏ పనైనా అవ్వొచ్చు.  ఉన్న పరిస్థితుల్ని మెరుగుపరిచే పనులు, సమాజానికి అవసరమైన పనులు “ఆవో సమూహం” చేస్తుంది.  ఒక్కడిగా చేయలేని, జట్టుగా చేయగలిగిన పనులేవైనా ఆవో ద్వారా చేయవచ్చు.  ఇదే ఆవో ఆశయం.

ఈ వికేంద్రీకృత సమూహంలో చేయాలనుకుంటున్న పనులకోసం “ఆవో బోర్డు“ను ఉపయోగించవచ్చు.  ఆసక్తి వున్నవారు aavoblog@gmail.com కు మెయిల్ చేసి బోర్డులో చేరవచ్చు. చేయాలనుకుంటున్న పనులను “To-do” లిస్టులో జతపరచవచ్చు. ఇప్పటికే బోర్డులో వున్నవారు ఆ పని గురించి చర్చించి జట్టుగా చేయవచ్చు.

ఆవో సమూహం ద్వారా కొన్ని ప్రాజెక్టులను చేపడుతున్నాం.  ఇప్పటివరకు మొదలైన, చేస్తున్న ప్రాజెక్టులు:

1. ఆవో బ్లాగు:

ఆవో సమూహం ద్వారా చేసే పనులను తెలియజేసేందుకు ఈ బ్లాగును ఏర్పాటుచేసాము.  ఇప్పటివరకు (18 జూలై 2018) కార్యక్రమాల గురించి టపాలేవీ ప్రచురించలేదు.  ఎలా ప్రచురించాలి, ఏమేం ప్రచురించాలి అన్నదానిపై ఆవో బోర్డులో నిర్ణయం తీసుకుని కార్యాచరణకు సంబంధించిన టపాలను మొదలుపెట్టబోతున్నాం.  ఇప్పటివరకు ఆవో సమూహంలో వివిధ వర్గాల టపాలను ప్రచురిస్తున్నాము. బ్లాగులో ఎవరైనా వారికి నచ్చిన పోస్టులు, అభ్యంతరకరంగా లేనివి, అవసరం వున్నవి ఏవైనా ప్రచురించుకోవచ్చు. కొత్తగా ఎవరైనా ఆవో బ్లాగులో రాయాలనుకుంటే aavoblog@gmail.com ను సంప్రదించవచ్చు.

2. ఆవో తపాలా:

మనుషుల్ని చైతన్యవంతుల్ని చేయాలి, సమాచారం సులభవంతంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అనే ఆలోచనతో ఈ ప్రాజెక్టునుమొదలుపెట్టాము.  దాదాపు 9 నెలల క్రితం (02/11/2017) “ఆవో సమూహము” పేరిట వాట్సాప్ మెసెంజర్లో సమూహాన్ని సృష్టించడం జరిగింది. ఆ రోజు మొదలు నేటి వరకు ఒక్కరోజు కూడా తప్పకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలు ఉదయాన్నే ఆవో వాట్సాప్ సమూహంలో చేర్చడం జరుగుతూంది.  కేవలం వార్తాపత్రికలు కాక ఇప్పటికే అంతర్జాలంలో అందుబాటులో వున్నా అనేక డిజిటల్ మేగజైన్లను, తెలుగు నవలలు, పుస్తకాలను, రేడియో నాటికలను, ఉపాధి పత్రిక (ఎంప్లాయిమెంట్ న్యూస్పేపర్) లాంటివాటిని ప్రతినిత్యం అందుబాటులో వుంచుతున్నాము. ఇకముందు తపాలా ద్వారా ఆవోబ్లాగు కు సంబంధించిన ముఖ్యమైన, ప్రజలకు చేరవేయాల్సిన టపాలను కూడా ఉంచబోతున్నాము. ఈ ప్రాజెక్టుకు “ఆవో తపాలా” అని పేరు పెట్టాము.

ఆవో తపాలాలో చేరడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – వాట్సాప్ సమూహము | టెలిగ్రామ్ సమూహము

3. అరణ్యవ్యాప్తి:

మొక్కలు ప్రకృతికన్నా మనిషికే మొదటి అవసరం.  అనేక స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వాలు మొక్కల పెంపకానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి.  కొన్ని మంచి ఫలితాలను ఇస్తున్నాయి కూడా.  కానీ, ఏ సంస్థ అయినా, ప్రభుత్వం అయినా కొంతవరకే సఫలమవుతాయి.  నాగరిక సమాజంలో వ్యక్తిగత బాధ్యత లేనిదే ఏ ప్రభుత్వం, ఏ సంస్ధసఫలీకృతమవ్వలేదు.  మొక్కలు నాటడం మనిషి బాధ్యత.  బ్రతకడానికి శ్వాసనిస్తున్న మొక్కను జాగ్రత్త చేయవలసిందే, పెంచి పోషించాల్సిందీ మనిషే. అది ఏ ప్రభుత్వ బాధ్యతో, సంస్థ బాధ్యతో కాదు. మనిషిగా బ్రతుకుతున్న ప్రతీప్రాణి కనీసబాధ్యత.

మొక్కల పెంపకానికి ప్రతీ వ్యక్తీ వ్యక్తిగతంగా కృషి చేసేందుకై ఆవో సమూహంద్వారా నర్సరీలను నడపదలిచాము. ఈ నర్సరీలు కూడా వికేంద్రీకృతమే.  “అరణ్యవ్యాప్తి” నర్సరీలు మొక్కలను మనుషులకు పంచుతుంటాయి.  తద్వారా ప్రపంచమంతా అందరికీ మొక్కలు అందుబాటులో తీసుకురావాలనేది ఈ ప్రాజెక్టు యొక్క ఆశయం.

4. చుక్కర్:

ఆవో ప్రాజెక్టులను, సమాజంలోని అనేక విషయాలను వెలుగులోకి తీసుకురావడంతోపాటు ఆవో సమూహం ద్వారా సృజనాత్మకత, వినోదం ఇతరత్రా దృశ్య (వీడియో) కంటెంట్ ను సృష్టించడం ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశ్యం.

ఈ నాలుగు ప్రాజెక్టులూ కూడా ఇంకా ప్రారంభదశలలోనే వున్నాయి.  ఇప్పటివరకు ఆవో సమూహం, ఆవో ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని నిర్ణయాలనూ వికేంద్రీకృతంగానే తీసుకోవడం జరిగింది.  ఇకముందు కూడా ఆవో బోర్డు ద్వారా కొనసాగుతూనే ఉంటుంది.  ఆవో వికేంద్రీకృత సమూహం నేడు అతికొద్దిమంది సహాయంతో సాగుతూంది.  మాయీ ప్రయాణంలో పరిచయమయిన ప్రతీ వ్యక్తితో కలసి ప్రకృతినీ, సమాజాన్నీ మెరుగుపరిచే అనేక ఆలోచనలతో, ప్రాజెక్టులతో ముందుకు సాగుతూంటాం.

ఇప్పటివరకు మాకున్న ఆలోచనలతోనే ఈ పేజీని రాయడం, అనేక పనులను చేస్తూండడం జరుగుతుంది. మీ రాకతో మరికొంత అభివృద్ధి జరగవచ్చు. వీటిలో ఏవైనా మార్పులు చేస్తే బావుంటుందని మీకనిపిస్తే మాకు తెలియజెప్పండి.

ఆవోబోర్డు ద్వారా వికేంద్రీకృతంగా రాయబడ్డ “ఆవో గురించి” పేజీ.

Leave a Reply