“జన గణ మన” మనం పాడేది కొంచెమే, ఇంకా ఉంది | Complete National Anthem of India

జనగణమన-అధినాయక జయ హే భారతభాగ్యవిధాతా!
పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ బంగ

వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛలజలధితరంగ
తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే,
గాహే తవ జయగాథా।
జనగణమంగళదాయక జయ హే భారతభాగ్యవిధాతా!
జయ హే, జయ హే, జయ హే, జయ జయ జయ జయ హే।।

జనగణమన భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. 1911లో మొదటి సారిగా పాడిన ఈ గీతాన్ని 1950జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ఠాగూర్ సృష్టించాడు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.

From Wikipedia

జాతీయ గీతంపై మొదట్లో కొన్ని విమర్శలు, వివాదాలు చెలరేగాయి. ఠాకూర్ నాటి ఐదో జార్జ్ చక్రవర్తిని కీర్తిస్తూ గీత రచన చేసాడని, దీనిని జాతీయ గీతం చేయడం ఏంటని కొన్ని విమర్శలు చెలరేగాయి. అయితే ఠాగూర్… ఓ లేఖతో ఈ వివాదానికి అడ్డుకట్ట వేశారు. తాను ఈ గీతం ఈ దేశాన్ని నడిపించే విధాత గురించి రాశానే తప్ప, కింగ్ జార్జ్ గురించి కాదని స్పష్టం చేయడంతో వివాదం ముగిసింది. అటు తర్వాత కూడా ఈ గీతంలో కొన్ని పదాలు తొలగించాలని, కొన్ని చేర్చాలని… అనేక వివాదాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. అయితే భారత అత్యున్నత న్యాయస్థానం అలాంటి పిటిషన్లను నిర్థ్వందంగా తోసి పుచ్చడంతో జాతీయగీతంగా రూపుదిద్దుకుంది. స్వాతంత్రోద్యమ సమయంలో జనగణమణ… రగిల్చిన స్పూర్తి నేటికీ దేశ ప్రజలను ముందుకు నడుపుతోంది. ప్రజల్లో సౌభాతృత్వమన్న భావనకు ఈ గీతమే పురుడుపోసింది.

ఇది మనం చిన్నప్పుడు బడిలో, తర్వాత కాలేజిలో, తర్వాత ఆఫీస్ లో పాడిన “జన గణ మన”, కానీ ఇది పూర్తి గీతం కాదు ఇంకా ఉంది. ఇప్పుడు మొత్తం విందాం. 

అసలు జన గణ మన (బెంగాళీ భాషలో)

 

Leave a Reply