ఆవో కార్యాచరణ

ఆవో సమూహం వికేంద్రీకృతంగా (Decentralized) సాగాలనేది మా ఆశయం. ఈ సమూహంలో సభ్యులు, వీక్షకులు అంటూ ఎవరూ లేరు. మా లక్ష్యమల్లా “ఆవో” లక్ష్యాలు ఒకరినుండి మరొకరికి వ్యాప్తి చెందుతూ వెళ్ళలనేదే.

ఇప్పటివరకూ ఆవో లక్ష్యాలలో మొదటిది ఆవో లక్ష్యాలు అందరికీ తెలియజేయాలనేదే. దానికోసం Trello Board ను ఎంచుకున్నాము. ఆవో చేసిన, చేయబోతున్న, చేయవలసిన పనులన్నిటినీ ఎప్పటికప్పుడు తెలియజేయడం కోసం Trello ను ఉపయోగిస్తున్నాము. మొదట Trello ను ఆవో సమూహ సభ్యులకు మాత్రమే అందుబాటులోకి తీసుకురావలనుకున్నా, అందరికీ అందుబాటులో ఉన్నా తప్పులేదనిపించింది.

నేటి ఆలొచనలకు తగ్గట్లు ఈ పేజీని రాయడం జరిగింది. భవిష్యత్తులో మరింత పారదర్శకంగా, మరింత వికేంద్రీకృతంగా ఉంచడానికి కృషి చేస్తాము.

Leave a Reply